Home తాజా వార్తలు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఫస్ట్‌లుక్

సమ్‌థింగ్ స్పెషల్‌గా ఫస్ట్‌లుక్

World Famous Lover

 

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. తాజాగా ప్రకటించిన సినిమా టైటిల్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక విజయ్ దేవరకొండ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో లాంగ్ హెయిర్, గడ్డంతో ఉన్న విజయ్ ముఖంపై రక్తపు మరకలతో కనిపించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్, ఇజాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సిబుల్ కథాంశంతో దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రానికి జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

World Famous Lover Movie First Look Released