Home తాజా వార్తలు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ట్రైలర్ విడుదల..

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ట్రైలర్ విడుదల..

World Famous Lover

టాలీవుడ్ రాక్ స్టార్ విజయ్‌దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’.  ఈ చిత్రంలో విజయ్ సరసన  నలుగురు హీరోయిన్లు రాశీఖన్నా, కేథరిన్‌, ఐశ్వర్యరాజేశ్‌, ఇజాబెల్లా లియతేలు నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో నలుగురి హీరోయిన్స్ తో విజయ్ చేసిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. మఖ్యంగా పల్లెటూరి యువతిగా నటిస్తున్న ఐశ్వర్యరాజేశ్‌, విజయ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ నవ్వు తెప్పిస్తున్నాయి. క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మిస్తున్న ఈ ఈ చిత్రాన్ని క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

World Famous Lover Movie Trailer Released