Home చిన్న సినిమాలు వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ విడుదల

వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ విడుదల

World Famous Lover

 

యంగ్ హీరో విజయ్‌దేవర కొండ ప్రస్తుతం మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా వరల్డ ఫేమస్ లవర్.. ఇప్పడు ఈ పదానికి చాలా క్రేజ్ తీసుకొచ్చాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన విడదల కానుండగా, ఈ సినిమాకు సంబందించిన టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి పూర్తిగా అర్జున్ రెడ్డి తరహా ప్రేమకథతోనే వస్తున్నాడని అర్దమైపోతుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్స్ నటిస్తుండగా, వారికి సంబంధించిన లుక్స్ ఒక్కో రోజు విడుదల చేశారు. డిసెంబ‌ర్ 12న ఐశ్వర్యా రాజేష్‌, 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నా లుక్స్ విడుద‌ల‌య్యాయి. రాశీ ఖన్నా వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్‌లో చాలా చూపించాడు దర్శకుడు క్రాంతి మాధవ్.

ముఖ్యంగా విజయ్ మధ్యలో చాలాసార్లు అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తూ.. రాశీఖన్నాతో లిప్ లాక్ సీన్స్ కూడా చేశాడు. కేథరిన్, ఎజిబెల్లా, ఐశ్వర్యా రాజేష్‌తో వచ్చే సన్నివేశాలు కూడా టీజర్‌లో చూపిస్తూ 1 నిమిషం 14 సెకన్స్ చాలా కవర్ చేస్తూ చూపించాడు దర్శకుడు క్రాంతి మాధవ్. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత విజయ్ కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. ఇక విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాట్టు తెలుస్తుంది. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రాన్ని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్పణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్న గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

 

World Famous Lover Teaser Released