Home తాజా వార్తలు ప్రపంచ ప్రఖ్యాత విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు

ప్రపంచ ప్రఖ్యాత విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు

World Famous Seed Production Centerవనపర్తి ప్రతినిధి : సిఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు.  రైతుల శ్రేయస్సు, వారి అభ్యున్నతి కోసం సకాలంలో ఎరువులు, విత్తనాలు ,రైతుబంధు సాయం అందించిన ఘనత తెలంగాణ సిఎం కెసిఆర్‌కే దక్కిందని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా సిఎం కెసిఆర్ విత్తన ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కృషి చేశారన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైతుబంధు, విత్తన సరఫరా , గోదాముల ఏర్పాటు, నూతన ఆధునిక వ్యవసాయ మార్కెట్లు, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. రైతులకు సంబంధించి అన్ని అనుకూలమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి ఇష్టా అధికారులతో మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రాలు, అన్ని రకాల రవాణా మార్గాలు అందు బాటు లో ఉన్నాయన్నారు. తెలంగాణ విత్తనోత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అనంతరం ప్రిన్స్‌పల్ కార్యదర్శి పార్థసారథి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో కమిషనర్ రాహుల్ బొజ్జా, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

World Famous Seed Production Center In Telangana