Home అంతర్జాతీయ వార్తలు సముద్రంలో అత్యంత పొడవైన ప్రాణి (వీడియో)

సముద్రంలో అత్యంత పొడవైన ప్రాణి (వీడియో)

Longest-Animal

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఒకవైపు ప్రపంచాన్ని స్తంభింప చేస్తుంటే మరోవైపు శాస్త్రవేత్తలు కొందరు ప్రపంచం లో పొడవైన జంతువు ఏదన్న కోణంలో పరిశోధనలు ముమ్మరంగా సాగిస్తుండడం విశేషం. ఆస్ట్రేలియా తీర సముద్ర అగాధంలో ప్రపంచం మొత్తం మీద అత్యంత పొడవైన 30 కొత్త సముద్ర ప్రాణి తెగలను శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. పశ్చిమ ఆస్ట్రేలియా సముద్రం అట్టడుగున లోయల్లో ఇదివరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని అత్యంత పొడవైన సైఫొనోఫోర్ అనే జంతువును కనుగొన్నారు. ఎగిరే పళ్లెంలా కనిపించే ఈ ప్రాణి 150 అడుగుల(46 మీటర్ల) పొడవుతో ప్రపంచం లోనే పొడవైన సముద్ర జంతువుగా రికార్డుకెక్కింది.

World Longest Animal Discovered in Australia Ocean