Friday, April 19, 2024

ఆరోగ్య సిబ్బంది కృషి అభినందనీయం: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

World Tuberculosis Day 2021

హైదరాబాద్: జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనలో ఆరోగ్యసిబ్బంది కృషి అభినందనీయమని కలెక్టర్ శ్వేతా మహాంతి తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజంపురా పర్హత్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం జరిగిన క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఏదైనా మహమ్మారి వచ్చిందంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురువుతాయో గత ఏడాది కరోనా వచ్చిన సమయంలో ప్రపంచం ఎలా తల్లడిందో తెలిసింది మహామ్మారితో మన రాష్ట్రమే కాదు, ప్రపంచమంతటా జీవన స్తంభించిందన్నారు. అయితే కరోనా మాదిరి కాకుండా క్షయ వ్యాధి మందులతో నయం చేయవచ్చన్నారు.

జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు సిబ్బంది కృషి అభినందనీయంగా ఉంది. హైదరాబాద్‌లో వలస కార్మికులు అత్యధిక శాతం ఉన్నారు. చాలా వరకు అద్దె ఇంట్లో ఉంటారు. వ్యాధి సోకిన వారు ఎక్కడికి వెళతారో తిరిగి రోగులను గుర్తించడం కష్టంగా ఉంది. అయిన ఆరోగ్య సిబ్బంది కృషితో వందశాతం క్షయ వ్యాధి నిర్ణీత కాలంలో నిర్మూలించేందుకు కృషి జరుగుతుందన్నారు. అంతకు ముందు క్షయ వ్యాధి అవగాహాన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్యాదికారి జి.వెంకటి, సంయుక్త సంచాలకులు రాజేశం,డిటిసిఓ వినయ్‌కుమార్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News