Home జాతీయ వార్తలు లడఖ్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి

లడఖ్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి

                  Road-in-Ladak

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో సరిహద్దు రోడ్డు ని ర్మాణ సంస్థ (బిఆర్‌ఒ) ప్రపంచంలో ఎత్తైన  మోటార్  రహదారిని నిర్మించింది. ఉమంగ్లా  మార్గంలో  19,300 పైగా అడుగుల ఎత్తులో హన్లేకు సమీపంలో 86 కి.మీ. పొడువైన వ్యూహాత్మక రహదారిని చైసుమ్లే, డెమ్‌చోక్ గ్రామాలతో అనుసంధానం చేశారు. భారత్‌చైనా సరిహద్దులకు రాయి విసిరేంత దూరంలో రహదారి నిర్మాణం చేపట్టారు. ‘ప్రాజెక్టు హిమాంక్’ పేరుతో  ఈ ఘనతను సాధించినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ బ్రిగేడియర్ డిఎం పుర్విమత్ తెలిపారు. ప్రతికూల వాతావారణంలో ప్రాణాలకు తెగించి రహదారిని నిర్మించామన్నారు. జాతీయ వ్యూహాత్మక ప్రాధాన్యతను దృష్టిలోని సిబ్బంది రాత్రింభవళ్లు శ్రమించి రహదారిని నిర్మాణం పూర్తి చేశారని బోర్డర్ రోడ్స్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.