Sunday, March 26, 2023

కీచక ప్రిన్సిపల్

- Advertisement -

principel

*పాఠశాలలో పని చేస్తున్న కేర్ టేకర్‌కు లైంగిక వేధింపులు
*రాజకీయ అండదండలున్నాయని భయపెడుతున్నాడు
*తనతో పాటు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలి ఆరోపణ
*జిల్లాలోని ఇమాంపేట మోడల్ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన

తాను అ అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చానని ఇదే విషయంపై ప్రిన్సిపల్‌ను మైనర్ బాలికలతో ఇలా ప్రవర్తించడం సరి కాదంటూ నిలదీశానని తెలిపింది. దీంతో ప్రిన్సిపల్ వారికి లేని బాధ నీకెందుకంటూ తనను దూషిస్తూ నన్నే ఎదురు ప్రశ్నిస్తావా..? నీవు ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించాడని తెలిపింది. తనకు రాజకీయ అండదండలు ఉన్నాయని నీవు ఎవరికి ఫిర్యాదు చేసినా నన్నేమిచేయలేరని ధీమాగా చెప్పాడా ని ఆమె వివరించింది. ఈ నెల 23న డిఈవో వెంకట నర్సమ్మ కు ప్రిన్సిపల్ ప్రవర్తనపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరో పించింది. విసికి పోయిన తనతో బలవంతంగా రాజీ నామ లేఖను ప్రిన్సిపల్ రాయించుకున్నాడని తెలిపింది. ప్రిన్సి పల్‌కు రాజకీయ అండదండలు ఉండబట్టే తన ఫిర్యాదును పట్టించు కోలేదన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేసింది. ప్రిన్సి పల్ వికృత చేష్టాలకు కోడి లింగయ్య, టి. నాగరాజు, కౌసర్ అంజూమ్‌లు అనే ఉపాధ్యాయులు కూడా అండగా ఉంటు తనను వేధించేందుకు సహకరిస్తున్నారని తెలిపింది.
ప్రిన్సిపల్ శంకర్‌నాయక్ వివరణ
ఈ విషయమై ప్రిన్సిపల్ శంకర్ నాయక్‌ను వివరణ కోరగా ఝాన్సిరాణి మానసికంగా సరిగా లేకా తనపై తప్పు డు ఆరోప ణాలు చేస్తున్నదని కుటుంబ భారంతో ఉద్యోగం చేయలేక రాజీనామ చేస్తున్నాని స్వయంగా రాజీనామ లేఖ తనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇది ఇ లా ఉండగా పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు మా ట్లాడుతూ ఝాన్సి వెనుక ఎవరో ఉండి ప్రిన్సిపల్‌పై చేయిస్తు న్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News