Home జాతీయ వార్తలు మహిళను చంపి…మొండెం నుంచి తలను వేరు చేసి….

మహిళను చంపి…మొండెం నుంచి తలను వేరు చేసి….

 

కోల్‌కతా: మహిళను చంపి…మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణా కోల్‌కతాలోని గరియాహట్ రెసిడెన్సీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఊర్మిళ కుమారీ(65) అనే వృద్ధురాలిని ఇంట్లో ఎవరు లేని సమయంలో హత్య చేశారు. ఆమె ఇద్దరు కుమారులు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఊర్మిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి మొండెం నుంచి తలను వేరు చేశారు. ఇంట్లో ఊర్మిళ అలజడి లేకపోవడంతో పక్కింటి వారు ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే పోలీసులకు పక్కింటి వారు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఇద్దరు కుమారులకు సమాచారం ఇచ్చారు. దుండగులు కత్తితో వృద్ధురాలు పలుమార్లు పొడిచి హత్య చేసిన అనంతరం మొండెం నుంచి తలను వేరు చేశారని పోలీసులు వెల్లడించారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని  సిపి మురళీధర్ శర్మ తెలిపాడు. గతంలో నేతాజీ నగర్, నరేంద్రపూర్ ప్రాంతంలో డబుల్ మర్డర్లు జరిగిన విషయం తెలిసిందే. దీంతో హంతకులను త్వరగా పట్టుకోవాలని సిఎం మమతా బెనర్జీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

 

Wowen head separated from her body in Kolkata area