Home జిల్లాలు ఆలస్యంపై ఆగ్రహం

ఆలస్యంపై ఆగ్రహం

waragalసకాలంలో పనులు పూర్తి చేయకపోతే చర్యలు
ఆలస్యంపై సిఎంకు ఫిర్యాదు
సిఎంఒ స్మితా సబర్వాల్

మనతెలంగాణ/పరకాల/శాయంపేట: తెలం గాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి అమలు చేస్తున్న మిషన్ భగీరథ పనులను నిర్ల క్షం చేయడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి, వాటర్‌గ్రిడ్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి కాంట్రా క్టర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం వాటర్ గ్రిడ్ పనుల పర్యావేక్షణలో భాగంగా వారు శాయ ంపేట మండలంలోని చలివాగులో నిర్మిస్తున్న నిర్మాణ పనులను పరిశీలించారు.

పరకాల/శాయంపేట:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి అమలుచేస్తున్న మిషన్ భగీ రద (వాటర్‌గ్రిడ్) పనులను నిర్లక్షం చేయడంపై ముఖ్య మంత్రి ప్రత్యేక అధికారి, వాటర్ గ్రిడ్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి కాంట్రాక్టర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం వాటర్ గ్రిడ్ పనుల పర్యావేక్షణలో భాగంగా వారు శాయంపేట మండలంలోని చలివాగులో నిర్మిస్తున్న నిర్మాణపనులను పరిశీలించారు. గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు సదరు కాంట్రాక్టర్ పనులను నడిపించడంలో ఆలసత్వాన్ని ప్రదర్శి స్తున్నారని వెంటనే పనులను పూర్తిచేసే విధంగా ప్రయత్నిం చాలని వారు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రానున్న మూడేల్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పనులను పూర్తిచేసి ఇంటింటికి మంచినీరు అందివ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కాంట్రాక్టర్లు మాత్రం పనుల్లో వేగం పెంచకపోవడం పట్ల వారు తీవ్రంగా మందలించారు. పరకాల నియోజికవర్గానికి యేడాది కాలంలో నీరందించా లన్న లక్షంతో స్థానిక యంఎల్‌ఎ కృషిచేస్తుంటే ఈ విధంగా పనులు జరిగినట్లయితే వారికి త్రాగునీరు అందించడం కష్టమేనని వారు తెలిపారు. పనులు సకాలంలో పూర్తిచేయడా నికి కావల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తున్న ప్పటికి ఈ విధమైన నిర్లక్షాన్ని కాంట్రాక్టర్ ప్రదర్శిస్తే పనుల ను పూర్తి చేయడం కష్టమని హెచ్చరించారు. చలివాగు నిర్మి స్తున్న ఇంటెక్‌వెల్ నిర్మాణ ఆలస్యానికి ఎదురవుతున్న సాంకే తిక పరమైన కారణాలను వారు అధికారులను అడిగి తెలుసు కున్నారు. ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి అవరోదం లేదని పనులను చేయడానికి కావలసిన మానవవనరుల కొరతే కొంత ఇబ్బంది ఉందని వారు అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నెల 16 వరకు ఇంటెక్‌వెల్ నిర్మాణాన్ని పూర్తిచే సి జూన్ 5 వరకు ఉపరితలం వరకు పనులను పూర్తి చేయా లని వారు కాంట్రాక్టర్‌తో పాటు అధికారులను ఆదేశిం చారు. వర్షాకాలం ప్రారంభం వరకు చలివాగులో నీరు చేరి పను లకు ఆటంకం కలుగనున్నందున ఇంటెక్‌వెల్ నిర్మాణంతో పాటు అక్కడ చేపట్టవలసిన అన్ని రకాల పనులను జూన్5 వరకు పూర్తిచేయాలని అధికారులను సూచించారు. ఇప్పటికే 20 రోజులు పనుల్లో ఆలస్యం అయినందున రోజులో 3 షిప్ట్‌లుగా పనులను వర్గీకరించుకొని పనుల్లో వేగం పెంచాలని వారు సూచించారు. జిపిఆర్ అనే నిర్మాణ సంస్థ వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనుల్లొ ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని సిఎం దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు స్మిత సభర్వాల్ తెలిపారు. దీనితో పాటు పరకాల, భూపాలపల్లి నియోజికవర్గాలలో పైప్‌లైన్ వేయ డానికి గల ఉన్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ పర్యావేక్షణలో తొలగించుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పనులు పూర్తిచేయాలన్నారు.నియోజకవర్గ పరిదిలో వాటర్ గ్రిడ్ నిర్మాణ పనుల్లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను స్థానిక శాసనసభ్యుడు ధర్మారెడ్డితో, సంభందిత అధికారులతో సంప్ర దింపులు జరిపి వాటిని తొలగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాకటి కరుణ, స్థానిక శాసన సభ్యుడు చల్ల ధర్మారెడ్డి, పరకాల జెడ్‌పిటిసి పాడి కల్పనాదేవి, యంపిపి సులోచన, నగరపంచాయతి చైర్మన్ మార్త రాజభద్రయ్య, వాటర్‌గ్రిడ్ యస్‌ఇ, డిఇలు ముగులు ఆర్‌డిఒ మహెందర్‌జీ, స్థానిక తహసీల్దార్ హరికృష్ణ, యంపిడిఒ కుమారస్వామి, కమీషనర్ రాచర్ల పరమేష్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, యంపిటిసిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
2018 కల్లా పూర్తిచేస్తాం:వాటర్‌గ్రిడ్ వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికి 2018 చివరి నాటికి ఇంటింటికి వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా నీరందిం చడమే లక్షంగా ప్రభుత్వం పనిచేస్తుందని వాటర్‌గ్రిడ్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పనుల పరిశీలనా అనంతరం స్థానిక యంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ॥ 40 వేల కోట్లతో ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపట్టి నిర్వహిస్తుందన్నారు. శుక్రవారం ఖమ్మంలోని భద్రాచలం మొదలు భూపాలపల్లి నియోజక వర్గంలోని ఘనసముద్రం, పరకాల నియోజకవర్గానికి నీరం దించే శాయంపేట మండలంలోని చలివాగులో నిర్మిస్తున్న ఇంటెక్‌వెక్ నిర్మాణ పనులను పర్యావేక్షించి పరిశీలించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు వాటర్‌గ్రిడ్ పథకా నికి 5,6 వేల కోట్ల రూపాలయలను ఖర్చు చేయడం జరిగిం దన్నారు. తెలంగాణలోని ప్రతి మారుమూల గ్రామంలోని ప్రతి ఇంటికి మంచినీరు అందించమే ప్రభుత్వ ప్రధాన లక్ష మన్నారు. రానున్న కాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులను నిర్వహిస్తామన్నారు. చలివాగులో నిర్మిస్తున్న పను ల్లో ఆలస్యమే తప్ప మిగితా అన్నిచోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే అభిమతంగా ముందుకు సాగుతున్నారని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనులల్లొ కాంట్రాక్టర్లు, అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు.
జూన్ నాటికి జిల్లాలో పైప్‌లైన్ నిర్మాణం పూర్తిచేయాలి
శాయంపేట పరకాల నియోజక వర్గాల పరిధిలో పైప్‌లైన్ నిర్మాణ పనులను ఎలాంటి ఆటం కాలు లేకుండా సకాలంలో పూర్తిచేయాలని వాటర్‌గ్రిడ్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సియంఒ ప్రత్యేక అధికారి స్మితాసభర్వాల్‌తో కలిసి శాయంపేట మండలం లోని చలివాగులో నిర్మిస్తున్న వాటర్‌గ్రిడ్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వర్షా కాలం కంటే ముందే జిల్లాలో పైప్‌లైన్ నిర్మాణం పూర్తిచే యాలన్నారు. వర్షాలు పడి రైతులు పంటలు వేసినట్లయితే ఇబ్బందులు ఎదురై తాయన్నారు. సుమారు 14 కిలోమీటర్ల మెర పెండింలో ఉన్న పైప్‌లైన్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూన్ నాటికి జిల్లాలో పైప్‌లైన్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆయన అధి కారులను కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించ కుండా పైప్‌లైన్లు వేసినట్లయితే వచ్చే సంవత్సరం నాటికి ఈ రెండు నియోజక వర్గాలలో ప్రతి ఇంటికి మంచినీరు అందిం చడం సాద్యమౌ తుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 24,800 నివాస గృహాలకు కొద్ది కాలంలోనే మిషన్‌భగీరధ పథకం ద్వారా త్రాగునీటిని అందించడం జరుగుతుందని అన్నారు.