Home ఎడిటోరియల్ షాయరె-ఇన్‌క్విలాబ్

షాయరె-ఇన్‌క్విలాబ్

“ఆప్ కీ యాద్ ఆతీ రహీరాత్‌భర్
చాందినీదిల్ దుఖ్‌తీ రహీరాత్‌భర్
ఘాహ్‌జలీత హుయా – హోష్ భుగ్తీ హుయా
శమా-ఎ-ఘమ్ జల్‌మిలీత రహీ రాత్‌భర్‌”
అంటూ ఫైజ్ అహ్మద్ ఫైజ్ స్మరించిన దెవరినోకాదు. ముగ్దుం మొహినుద్దీన్‌ను ఉద్దేశిం చిన సైఫైజ్ కవితా పంక్తులు చదువరుల, శ్రోతల హృదయాలను కదిలించి వేస్తాయనుటలో అతిశయోక్తి లేదు.
writerముగ్దుంమొహినొద్దీన్ 1908 సం॥ ఫిబ్రవరి నాల్గోతేదీన ఒక నిరుపేద ముస్లిం కుటుంబం లో జన్మించాడు. మెదక్ మండలంలోని, ఆందోల్ ఆయన జన్మస్థలం. తండ్రి మహ్మద్ గౌస్. అల్లా భక్తుడు. తల్లి ఉమ్దా బేగం. అతి చిన్నవయస్సు లోనే ముగ్దుం తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి మరొకరిని పెండ్లాడి ముగ్దుంను విడిచివెళ్లింది. అనాథయైన ముగ్దుంను చిన్నాయన నిజాముద్దీన్ చేరదీశాడు. స్వగ్రామంలోనే పాఠశాల విద్య పూర్తి చేశాడు. తనమేనమామ వద్ద మతవి ద్యను నేర్చు కున్నాడు. మసీదును శుభ్రం చేయడం, నమాజు చేయడం నిత్యకృత్యంగా మలచుకున్నా డు. ఆ తర్వాత పై చదువులకు హైదరాబాద్ వెళ్లి ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి బిఎ మరియు ఎంఎ పట్టాలను పొంది అచ్చటే 1936లో స్థిరపడ్డాడు.
ఈ కాలానికే భారతదేశ స్వాతంత్య్రం కోసం దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం యువతలో స్వాతంత్య్రేచ్ఛను రగి ల్చింది. ముగ్దుంకూడా ఉద్యమంలో భాగస్వామి యైనాడు. చిన్నతనంనుంచే తన జీవితను తానే సంపాదించుకోవాలని భావించిన ముగ్దుం చదువుకునే రోజుల్లోనే పెయింటింగ్స్, సినిమా తారల ఫోటోలు అమ్మేవాడు. ట్యూషన్లు చెప్పే వాడు. పత్రికలు ఇంటింటికీ పంచేవాడు. అయితే ఎంఎ ఉత్తీర్ణుడైన ముగ్దుం సిటీ కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి తాను అమితంగా ప్రేమించే ఉర్దూభాషా సాహిత్యాలను విద్యార్థుల కు బోధించడం ప్రారంభించాడు. ఆయన బోధన పటిమ భాషా చతురత , సాహిత్యవైదుష్యం పిల్లల నందరినీ అలరించేది.
స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలను పణం పెడ్తున్న విప్లవవీరుల స్ఫూర్తితో కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితుడైన ముగ్దుం చండ్ర పుల్లారెడ్డి, రాజబహద్దూర్‌గౌడ్ వంటి వారితో కల్సి కమ్యూనిస్టుపార్టీ స్థాపనకు కృషిచేశాడు. చదువు కుంటున్న రోజుల్లోనే నాగపూర్ వెళ్లివచ్చిన ముగ్దుం అక్కడి కామ్రేడ్ల స్ఫూర్తితో హైదరాబాద్‌లో విద్యార్థి సంఘనిర్మాణానికి పూనుకొని పూర్తికాల పు కమ్యూనిస్టుగా మారిపోయాడు (1940).
భారతస్వాతంత్య్ర ఉద్యమంతోబాటు హైదరాబాద్‌ను నిజాం కబంధ హస్తాలనుండి విముక్తి చేయ డానికి ఉద్యమిస్తున్న ముగ్దుంను నిజాం సహించలేదు. తీవ్రమైన దమననీతిని

అమలు చేసినా అదరని, బెదరని ముగ్దుం స్వాతంత్రేచ్ఛను మరింత యత్నించాడు. ఇందుకు విద్యార్థులను, ప్రజలను సమాయత్తం చేశాడు. ఈ విప్లవోద్య మానికి తనకు సహజంగా లభించిన కవిత్వగళను ఉపయోగించుకున్నాడు. ప్రపంచ సాహిత్యా లన్నిటిలో పెల్లుబుకుతున్న విప్లవ ధోరణులకు, ఇక్బాల్ కవితల ప్రభావానికి లోనైన ముగ్దుం కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకుగా పాల్గొనే వాడు. పేరొందిన కమ్యూనిస్టు యోధు లతో సంబంధాన్ని ఏర్పచురుకుని హేతువాదం, మార్కిస్టు భావజాలాన్ని జీర్ణించుకున్నాడు. సామ్రాజ్య వాదం, ఫాసిజంలపట్ల తీవ్ర వ్యతిరేక తతో అభ్యుదయపథంలో కొనసాగాలని నిర్ణయిం చుకున్నాడు. ఇందుకు హైదరాబాద్‌లో సరోజినీ నాయుడు గృహం ‘గోల్డెన్ థ్రెషోల్డ్’ వేదికైంది. ఈ భవనంలోనే జయసూర్య, జెవి.నర్సింగ్‌రావు ప్రభృతులలో ముగ్దుం రాజకీయ చర్చలు, సాహిత్య చర్చలు జరిపేవాడు. ఈ చర్చల స్ఫూర్తి తో అక్బర్ హుసేన్, సిబ్తెహసన్‌లతో కలిపి హైదరాబాద్‌లో అభ్యుదయ రచయితల సంఘ శాఖను నెలకొల్పాడు. దేశంలోని కామ్రేడ్లతో సత్సంబంధాలున్న ముగ్దుం కామ్రేడ్స్ సంఘంలో సభ్యుడై క్రియాశీలంగా వ్యవహరించేవాడు.
ఉర్దూభాష అరబ్బు, పారశీకం, సంస్కృతం, పాకృతం మున్నగు పదాలలో సుసంపన్నమైనట్లు భాషావేత్తలు భావిస్తున్నారు. ఈ భాష అతిసున్నిత భావాలను వ్యక్తీకరించటానికి, శృంగార, వీర, కరుణ, హాస్యరసాలను ఒలికించడానికి ఉపక రిస్తుందని సాహిత్యకారులు భావిస్తున్నారు. మృదుమధురమైన ఈ భాష వైయక్తిక అనుభూ తుల వ్యక్తీకరణకు చక్కని మాధ్యమమని విమర్శకుల అభిప్రాయం. ఎంఎ పట్టా పొందిన ముగ్దుం ఉర్దూసాహిత్యంలో మక్కువ ను ? పెంచు కున్నారు. మొదటి ఒక భావకవిగా తన కవిత లను జాలు వారించాడు. అంతేగాదు ముగ్దుం రాసిన విప్లవగీతాలు వీరరసాన్ని ఒలికించిన దాఖలాలెన్నో ఉన్నాయి. స్వాతంత్య్ర యోధులు ఆయన గీతాలు వింటూ, పాడుతూ ఉద్యమాన్ని ఉరకెల్తించేవారు.
“యేజింగ్‌హై, జంగ్-ఎ-ఆజాదీ, ఆజాదీకీ పర్చామ్ కె తలె” అంటూ ఆయన రాసిన కవాతుగీతం ప్రజలను విప్లవోన్ము ఖులను చేసింది. ఇది ఒక యుద్ధం, ప్రజా యుద్ధం, స్వాతంత్య్ర యుద్ధం, స్వేచ్ఛాపతాక చ్ఛాయల్లో జరుగుతున్న యుద్ధం ’ అంటూ ఉప్పొంగిన ఉత్సాహంతో కవితా గానం చేస్తూ ముగ్దుం ప్రజలను మోహ రించాడు. ఈ గీతానిన నాటి స్వాతంత్య్ర సమర యోధులు అనునిత్యం వేదంలా వల్లించేవారు. అట్లే ‘మౌత్‌కాగీత్’ (మరణగీతం) అన్నకవితలో విప్లవాత్మక వ్యంగ్యా న్ని, రెండో ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా రాసిన “జుల్ఫెఛలీఫా, సిఫాయా, అంధేరా’ వంటి గీతాల్లో ముగ్దుం చేసిన ఈ రచనలు పలువురి హృదయాలను అలరించాయి. ముగ్దుం నాటికలూ రాశాడు. తాను రాసిన నాటిక ‘హోష్ కే నా ఖూన్’ ను హైదరాబాద్‌కు వచ్చిన రవీంద్రులముందు ప్రదర్శించి ఆయన ప్రశంసలు పొందాడు. ఆయన రాసిన మరో నాటిక ‘ముర్షదే కామిద్’ కూడా పలువురిని ఆలోచింపజేసింది. ఆయన మొదటగా రాసిన కవిత ‘టూర్’(1934), ‘గోదే ప్రేమ లేఖలు’ పాఠకుల మన్ననలు పొందారు.
ముగ్దుం రాసిన ‘ఏక్ చమేలీ కె మందవేతలే-మైకడాసే జరాదోర్ ఉస్ మోడ్‌పర్..ప్యార్ ఉన్‌కే ఖుదా, ప్యార్ ఉన్‌కే బదా’ అన్న భావకవిత సాహి త్య ప్రేమికులను పులకరింపజేశాయి. అంతేగాక ఆయన ఊల్చిన నాట్యవేదిక ‘బిసాత్-ఎ-రక్స్’ సంపుటాలు సాహిత్య అకాడమీ పురస్కారాలను పొందాయి. ఆయన రాసిన ఖైద్ అనే కారాగార గీతం, బాద్‌గర్, చాంద్‌తారో, కలన్ ముననగు గజళ్లు ప్రజలనోళ్లలో నానాయి. కొన్ని గజళ్లు హిందీ చిత్రాల్లో చేరి ప్రేక్షక శ్రోతలను ఉర్రూత లూగించాయి. ఆయనను మహాకవి ‘శ్రీరంగం శ్రీనివాస రావు’తో, పాకిస్థాన్ కవిరతం సము ‘ఫైజ్ అహ్మద్ ఫైజ్’తో, బంగ్లాదేశ్ జాతీయ కవి ‘నజ్రుం ఇస్లాం’తో సాహిత్య ప్రపంచం పోల్చింది. అంతే గాదు ఆయన షాహిరె ఇన్విక్విలాబ్ అని కీర్తికాంచాడు. ముగ్దూం మొహిననొద్దీన్ రజియా బేగంను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతు లకు ఒక కుమార్తె ఇరువురు కుమారులు జన్మిం చారు. వారి లో ఒకరు నుస్రత్ మొహినొద్దీన్ పేరున్న ఉర్దూ కవి. మరోకుమారుడు జాఫర్ మొహొనొద్దీన్ కార్మికోద్యమ నాయకుడు. కూతురు జకియా బేగం గృహిణి.
ఈ విప్లవ యోధుడు పూర్తికాలం ప్రజా ఉద్యమాలతో మమేకం కావాలన్న ఆకాంక్షతో 1943లోనే ఉపన్యాసక వృత్తిని త్యజించాడు. ఒకనాడు బహిరంగ సభలో బ్రిటిషు ప్రభుత్వాన్ని విమర్శించినందుకు మూడునెలలపాటు కారా గారశిక్ష అనుభవించాడు. 1944-46 సంవత్స రాల్లో హైదరాబాద్‌లోనూ, సంస్థానం లోనూ కార్మికులందరినీ ఏక్రతితం చేసి కార్మికసంఘాల నిర్మాణానికి పూనుకున్నాడు. వారి హక్కుల సాధనకు ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1946 ఆగస్టు 16వ తేదీన ఏర్పా టైన ‘ఆల్‌హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్’ కు అధ్యక్షత వహించాడు. ఈయన కార్యకలాపాలు సహించని నిజాం ప్రభుత్వం తిరిగి దమననీతికి పాల్పడింది. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లాడు. అజ్ఞాతంలోనే ఉంటూ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రసిద్ధ గీతం ‘తెలం గాణ’రాసాడు. ఈ గేయం తెలంగాణా సాయుధ పోరాటయోధులకు స్ఫూర్తినిచ్చింది. ముగ్దుం కార్మికోద్యమ నేతగా చైనా, సోవియట్ సోషలిస్ యూనియన్ (రష్యా)దేశాలను పర్యటించాడు.
అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ముగ్దుం 1952లో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్ర శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1952 నుచి జాతీయ స్థాయి కార్మికోద్యమాల నిర్మాణం, నిర్వహణల్లో భాగంగా దేశమంతటా పర్యటించి కార్మికుల కొంగుబంగారమయ్యాడు. ఈ కార్మికోద్యమనేత 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలికి కూడా ఎంపికయ్యాడు.
ఇంతటి మేధావి, ప్రతిభావంతుడు, మహా కవి, విప్లవయోధుడు, కార్మికనేత, మిత్రులను, కుటుంబసభ్యులను విషాదంలోకి నింపి 1969 సం॥ ఆగస్టు 25వ తేదీన అస్తమించాడు. ఆయన జ్ఞాపకార్థం Alum ఖుదా మిరీ ఫౌండేషన్ పక్షాన 2008 సం॥ఫిబ్రవరి లో శతజయంత్యుత్సవ సభలు నిర్వహించారు. ఈ సభలకు విభూతి నరేన్‌రాయ్, పి.యం.భార్గవ, సయ్యద్ ఇ.హుసేన్ ప్రభుత్వ ప్రముఖులు హాజరై ముగ్దుంకు ఘననివాళి అర్పించారు. ఈ మహాసభల సంద ర్భంగా newage పత్రికలో “ముగ్దుం ఓవైపు వెలుగులీను అగ్నికీల, మరోవైపు శీతల శీకుర తుహినబిందువు. ఓ వైపు విప్లవవాదియై విప్లవ శంఖమూదినవాడు. మరోవైపు చిరుగజ్జె సవ్వడిని తన కవితలలో పండించినవాడు. అతడు జ్ఞాని, కర్మిష్టి, అసామాన్య ప్రజ్ఞా పాట వాలు కల్గినవాడు. ఆయన విప్లవ గెరిల్లాలు ఏతి లోని తుపాకీ. ఒక విశిష్టసంగీతజ్ఞుడు. ఆయన ఘాటు వాసనలు గల తుపాకి మందు. అంతే గాదు మల్లెల సువాసన లను గుబాళింపుకు ప్రతి నిధి” యంటూ ఖాజీ అహ్మద్ అబ్బాస్ పేర్కొ న్నాడు.
ఆయన కళాశాల విద్యార్థులకు తలలో నాలుక. అధ్యయనంలోనూ నీతినియమాలలోనూ ఆయనకు ఆయనేసాటి. ఉద్యమ సంస్కృతిని, జీర్ణించుకున్న ముఖ్దుం బహుముఖ ప్రజ్ఞాశీలి. భారతీయ సాంస్కృతిక, సాహిత్య, కళా, సామాజిక రంగాల్లో తన ముద్రను కనబరచిన ముగ్దుం విశేష జనాదరణ పొందాడు. ఇంతటికి మహాకవికి మనమేం ఇవ్వగలం. కేవలం స్మరణ తప్ప. ఆయన ప్రచురణలను తిరిగి పరిచయం చేయగల్గితే అదే మనం ఆయన కివ్వగల నివాళి. ఆయన చిరయశస్వి. విశిష్ట మనస్వి.