Friday, June 13, 2025

ఒళ్లు గగురుపొడుస్తున్న ప్రమాదం… వీళ్లకు భూమ్మీద నూకలున్నాయి

- Advertisement -
- Advertisement -

వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్, కారును లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇనుపచువ్వలతో వెళ్తున్న లారీ కొబ్బరి బొండాల వ్యాన్‌ను ఢీకొట్టింది. అనంతరం కారును ఢీకొట్టి వంతెన పైనుంచి లారీ కింద పడింది. కారుపై ఇనుప చువ్వలు పడడంతో వాహనం నుజ్జునుజ్జుగా మారింది. కారు పడిన ప్రదేశంలో చెత్త చెదారం ఉండడంతో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. రోడ్డు ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఒళ్లు గగురుపోడుస్తుంది. భూమ్మీద నూకలుండడంతో నలుగురు బతికి బయటపడ్డారని వాహనదారులు వాపోతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News