Home అంతర్జాతీయ వార్తలు ఆయా దేశాలు ఐరాస నిబంధనలను లిఖించలేవు

ఆయా దేశాలు ఐరాస నిబంధనలను లిఖించలేవు

Xi Jinping takes veiled swipe at US as China marks 50 yrs at UN

 

అమెరికానుద్దేశిస్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యలు

బీజింగ్: అంతర్జాతీయ నిబంధనలను ఆయా దేశాలు తమ అభీష్టానికి అనుగుణంగా లిఖించలేవని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి(ఐరాస)లోని 193 దేశాలు ఉమ్మడిగా వాటిని రూపొందిస్తాయని ఆయన అన్నారు. బహుళ దేశాలతో కలిసి పని చేయడానికి ఐరాస నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని జిన్‌పింగ్ అన్నారు. ఐరాసలో చైనాను చేర్చుకొని 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఐరాసలో వీటో అధికారం ఉన్న ఐదు దేశాల్లో చైనా ఒకటన్నది గమనార్హం. అమెరికాను ఉద్దేశించే జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల ఈ రెండు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాణిజ్య సంబంధాల్లో విభేదాలతోపాటు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్య ధోరణిని అమెరికా ప్రశ్నించడంలాంటి అంశాలు అందులో ఉన్నాయి. ఐరాస చార్టర్‌కు అనుగుణంగా చైనా తన బాధ్యతలు నిర్వహిస్తుందని జిన్‌పింగ్ అన్నారు. ఐరాస శాంతిపరిరక్షక దళాల్లో తమ దేశానికి చెందిన 50,000మంది పని చేస్తున్నారని జిన్‌పింగ్ తెలిపారు. ఐరాసకు అధికమొత్తంలో ఆర్థిక తోడ్పాటునిస్తున్న దేశాల్లో తమది రెండోదని జిన్‌పింగ్ అన్నారు.

Xi Jinping takes veiled swipe at US as China marks 50 yrs at UN