మన తెలంగాణ/హైదరాబాద్ : కస్టమర్లకు మెరుగైన ఉత్పత్తులు, సేవలను అందించే సెల్‌బే శుక్రవారం నాడు షియోమీకి చెందిన 12 ప్రొ మొబైల్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సెల్‌బే ఎండి సోమ నాగరాజు మాట్లాడుతూ, అన్ని షోరూంలలో కస్టమర్లకు ఎల్లప్పుడు కొత్త ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లను అందిస్తామని అన్నారు. తమ కంపెనీ విజన్ ఎప్పుడు కూడా తమ కస్టమర్లకు ఉత్తమ అనుభం, మెరుగైన విక్రయ, సేవలను అందించడమే అని అన్నారు. కంపెనీ డైరెక్టర్ సుహాస్ నల్లచెరు మాట్లాడుతూ, షియోమీ వారి 12 ప్రొ ఒక వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ అని, ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1, అలాగే ట్రిపుల్ కెమెరా 50 +50 +50 ఎంపి, 4600 ఎంఎహెచ్ బ్యాటరీని కల్గి ఉంటుందని అన్నారు. 12 ప్రొ 8 /256, 12 /256 వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ ఫోన్ రూ.63,999 ప్రారంభ ధరతో అన్ని సెల్‌బే షోరూంలలో లభిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రారంభ ఆఫర్ కింద రూ.6 వేల క్యాష్‌బ్యాక్ ఉంది. లాంచింగ్ కార్యక్రమంలో షియోమీ తెలంగాణ, ఎపి జోనల్ బిజినెస్ మేనేజర్ శివేందర్, తదితరులు పాల్గొన్నారు.
Xiaomi 12 Pro smartphone was released