Home టెక్ ట్రెండ్స్ తక్కువ ధరలో.. అదిరిపోయే ఫీచర్లతో రెడ్ మి 4

తక్కువ ధరలో.. అదిరిపోయే ఫీచర్లతో రెడ్ మి 4

Redmi-4

న్యూఢిల్లీ : చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమి అదిరిపోయే ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. రెడ్ మి నోట్ 4, రెడ్ మి 4ఎ ఫోన్ల గ్రాండ్ సక్సెస్ తర్వాత అదే సిరీస్ లో రెడ్ మి 4 ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియట్లతో అందుబాటులో రానుంది. రెడ్ మి 3ఎస్, 3ఎస్ ప్రైమ్ సక్సెసర్ గా మార్కెట్లోకి వస్తున్న ఈ మొబైల్ మే 23 నుంచి ఈ ఫోన్ అమెజాన్, ఎంఐ వెబ్ సైట్లో విక్రయించనున్నారు. 2జిబి ర్యామ్, 16 జిబి స్టోరేజీ ఫోన్ – రూ.6,999, 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజీ ఫోన్ – రూ.8,999, 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజీ ఫోన్ – రూ.10,999లకు విక్రయించనున్నట్లు సమాచారం.

షియోమి రెడ్ మీ 4 ఫీచర్లు :

  • 2.5డి కర్వ్‌డ్ ఎడ్జ్‌తో 5 అంగుళాల హెచ్‌డి డిస్ల్పే
  • స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టాకోర్ ప్రాసెసర్
  • వెనుక 13 ఎంపి పీడీఏఎఫ్ కెమెరా
  • బ్యూటీఫై మోడ్‌తో 5 ఎంపి సెల్ఫీ కెమెరా
  • 4100 ఎంఎహెచ్ బ్యాటరీ
  • 4జి, డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్
  • ఆండ్రాయిడ్ మార్ష్ మెలో, MIUI 8