Saturday, April 20, 2024

అతి తక్కువ ధరలో చైనా ఎగిరే ఎలక్ట్రిక్ కారు!

- Advertisement -
- Advertisement -

Xpang flying car

బీజింగ్: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ సంస్థ ఎక్స్‌పెంగ్ ఇటీవల ఎగిరే కారును ఆవిష్కరించింది. 2024 నాటికి ఈ ఎగిరే ఇవిని మార్కెట్‌లోకి తేగలమని ఆ సంస్థ పేర్కొంది. గత వారం ఈ సంస్థ 500 మిలియన్ డాలర్ల ఫండ్‌ను సేకరించింది. టూ సీటర్ అయిన ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కారును పరిమిత సంఖ్యలోనే తయారు చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. టెస్లా కంపెనీకి పోటీదారుగా ఉన్న ఎక్స్‌పెంగ్ టెస్లా కంటే మూడు చౌక అయిన ఎలక్ట్రిక్ సెడాన్ కార్లను తయారుచేసింది. చైనా తయారు చేసిన ఈ కారు ఒక్క తడవకు 35 నిమిషాలపాటు ఎగురుతుంది. నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన ఈ ఇవి కంపెనీ(ఎక్స్‌పెంగ్) రూ. 1.18 కోట్ల కన్నా తక్కువ రేటుకే ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కారును అందించాలని చూస్తోంది. మిగతా వాటితో చూస్తే దీని ధర చాలా తక్కువ. జనరల్ మోటార్స్, టయోటా, హ్యూండాయ్ వంటి దిగ్గజ కంపెనీలకు ఈ కంపెనీ పోటీనిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News