Friday, April 19, 2024

యాదాద్రి భువ‌న‌గిరి క‌లెక్ట‌ర్‌ కారును ఢీకొట్టిన లారీ

- Advertisement -
- Advertisement -

Yadadri Bhuvanagiri Collector Car Hit By Lorry

యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా క‌లెక్ట‌ర్ అనితా రామచంద్రన్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓలారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదం భువనగిరి మండలం నంద‌నం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఈఘటనలో కారు పూర్తిగా దెబ్బ‌తిన్న‌ప్ప‌టికీ అదృష్ట‌వ‌శాత్తు క‌లెక్ట‌ర్ ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల వల్ల  గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాలను ప‌రిశీలించి తిరిగి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.

Yadadri Bhuvanagiri Collector Car Hit By Lorry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News