Home యాదాద్రి భువనగిరి యాదాద్రి అభివృద్ధి పనులపై సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి

యాదాద్రి అభివృద్ధి పనులపై సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి

WORKS

మనతెలంగాణ/భువనగిరిటౌన్: యాదాద్రి అభివృద్ధి పనులపై సిపిఐ  ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు వినతిపత్రం అంద జేశారు.  సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ 9న రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి యాదాద్రి పనులను పరిశీలించారని, ముఖ్యమంత్రి కేసిఆర్ యాదాద్రి అభివృద్ధి పట్టణాభివృద్ధికోసం చేస్తున్న ప్రణాళికలు చాలా సంతోషకర మైనవని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అభివృద్ధినికాంక్షిస్తున్నారని తెలిపారు. యాదాద్రి పర్యటనలో కొన్ని సమస్యలు తమ దృష్ఠికి వచ్చాయని తెలిపారు. భక్తులకు కనీస సౌకర్యాలు, వసతిగదులు సరపడలేవని, ఈఓ విధినిర్వహణ పనుల పర్యావేక్షణ లేదని, పనిచేసేచోట ఉండడంలేదని తెలిపారు. కొండపై వ్యా పారులు అధికధరలకు  విక్రయించటం వల్ల భక్తులు ఇబ్బంది పడుతు న్నారని, భవన నిర్మాణ పనుల పర్యావేక్షణలేక నాణ్యతలోపిస్తున్నదని, యా దాద్రి అభివృద్ధి పనులపై విచారణ జరిపించాలన్నారు. భూనిర్వా సితులకు సరిపడా నష్టపరిహారం ఇచ్చి వారి కుటుంబాలకు ఉపాధికల్పించాలని, కొండపైన ఎంఎన్‌ఆర్‌లను పర్మినెంట్ చేయాలని, యాదాద్రి నిరుపేద ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు, డబుల్‌బెడ్‌రూం కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. ఇమ్రాన్, సిపిఐ యాదగిరిగుట్ట మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్ పాల్గొన్నారు.