Thursday, March 28, 2024

యాదాద్రి రహదారి.. అత్యంత సుందరం

- Advertisement -
- Advertisement -

yadadri

30 కి.మీ.లు 3.72 లక్షల మొక్కలు
వ్యయం రూ. 5.55 కోట్లు

హైదరాబాద్ : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ది చెందిన చారిత్రాత్మక యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ప్రధాన రహదారిని సుందరంగా హెచ్‌ఎండిఎ తీర్చిదిద్దుతున్నది. యాదగిరిగుట్టకు వెళ్ళే రహదారిలో దాదాపు 30 కి.మీ.ల మేర సెంట్రల్ మీడియన్(2.3 మీటర్లు వెడల్పు) సుందరీకరించే(బ్యూటిఫికేషన్) పనులకు అథారిటీ శ్రీకారం చుట్టిండి హెచ్‌ఎండిఎ. పురపాలక పాలన, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో జాతీయ రహదారి- 163 నాలుగు లేన్‌ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ఘట్కేసర్ నుంచి రాయగిరి(యాదాద్రి) వరకు (30కి.మీ.ల) పచ్చదనంను అభివృద్ధి పరచాలని, సుందరీకరించే పనులను హెచ్‌ఎండిఎ ప్రారంభించింది.

ఇందుకు రూ. 5.55 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన రెండు నెలల్లో పూర్తిచేయాలని సంకల్పించిన హెచ్‌ఎండీఏ ఒక్క కిలోమీటర్ కు రూ.18.50 లక్షలు అంచనా వ్యయంతో గురువారం (ఫిబ్రవరి 27న) పనులు మొదలు పెట్టింది. జాతీయ రహదరాని నెం.- 163 యాదగిరిగుట్ట వరకు పచ్చదనం, సుందరీకరించడం పనులు చేపట్టాలన్న విజ్ఞప్తికి అథారిటీ సానుకూలంగా నిర్ణయించింది. జాతీయ రహదారిలోని మధ్యలో 3.72 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్దంచేసి కార్యరూపంలోకి తీసుకువచ్చింది. 30 కి.మీ.లు పొడవును 4 కి.మీ.లుగా 7 భాగాలుగా చేసి అతి తక్కువ వ్యవధిలో పనులు పూర్తిచేయాలని అథారిటీ నిర్ణయించింది. ముఖ్యంగా 2.3 మీ.లు స్థలంలో పగడ, పుత్రన్ జీవ తదితర మొక్కలు నాటాలని నిర్ణయించిన అథారిటీ.

yadagiri

yadadri road most beautiful with plants

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News