Home జిల్లాలు యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రిలో భక్తుల సందడి

yadiri-templeయాదగిరిగుట్ట : శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనార్థం తరలి వస్తున్న భక్తులతో యాదాద్రిలో సందడి వాతావరణం నెలకొంది. మూడు రోజులు వరస సెలవులు రావడంతో శనివారం రోజున స్వామి వారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.ఆలయ అధికారులు తెల్లవారు జామున 3గంటలకే ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ, అభిషేక, అర్చన నిత్య పూజా కార్యక్రమాలతో చేపట్టి 6.15 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులు తమ మొక్కుబడిగా తలనీలాలను సమర్పించుకొని, విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారి కళ్యాణ సేవ, శ్రీసత్య నారాయణ స్వామివారి వ్రత పూజలు, అర్చన, ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కళ్యాణ కట్ట, ప్రసాదాల క్యూలైన్, దర్శన క్యూలైన్‌లలో వ్రతపూజల వద్ద ఆలయ పరిసర ప్రాంతాలలో భక్తుల సందడి నెలకొంది. శ్రీవారి అనుబంధ ఆలయాలైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇదే పరిస్థితి. యాదగిరికొండకు వచ్చిన భక్తులలో దాదాపు 60శాతం భక్తులు శ్రీపాతగుట్ట స్వామి వారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.