Friday, April 26, 2024

కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ హిమాలయ పర్వతాలలో కొలువై ఉన్న కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు శీతాకాలం సందర్భంగా గురువారం మూతపడ్డాయి. వేద పండితులు మంత్రాలు పఠిస్తుండగా భక్తుల దర్శనానంతరం గురువారం ఉదయం 8.30 గంటలకు కేదార్‌నాత్ ఆలయ తలుపులను మూసివేసినట్లు బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్, తీర్థ పురోహిత్, రుద్రప్రయాగ్ జిల్లా పాలనాధికారులతోసహా 3, 000 మందికిపైగా భక్తులు గురువారం ఉదయం ఆలయాన్ని సందర్వించారు. ఈ సందర్భంగా భారతీయ సైన్యానికి చెందిన 11వ మరాఠా రెజిమెంట్ భక్తిసంగీతాన్ని అందచేసింది. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో 43 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ఒక్క కేదార్‌నాథ్ ఆలయాన్నే 15.61 లక్షలకు పైగా భక్తులు దర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News