Sunday, March 26, 2023

యాసంగి పంట చేతికందాకే…మూసీ కాలువల ఆధునీకరణ

- Advertisement -

river

*రబీకి నీరు చేరుతోంది
*మార్చి వరకు విడుతల వారీగా విడుదల
*ప్రభుత్వ వేగాన్ని అందుకోని అధికారులు
*టెండర్లలో జాప్యం

రైతులకు కడుపునింపే మూసీ ప్రాజెక్ట్ కాల్వల ప్రక్షాళనకు ప్రభుత్వం ఉత్తర్వులు వెంటనే జారీచేయగా, పనుల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. గత ఏడాది అక్టోబర్ 12న సూర్యాపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి  పర్యటనకు విచ్చేసిన  సిఎం కెసిఆర్ మూసీ ప్రాజెక్ట్ ప్రస్తావనలో భాగంగా ఆధునికీకరణకు రూ. 65కోట్లు కేటాయించిన  విషయం విదితమే. సిఎం ప్రకటించిన కొద్ది రోజుల్లోనే  నిధులు విడుదలయ్యాయి . పనులు వేగంగా సాగాల్సిన తరుణంలో టెండర్‌ల ప్రకియల్లో  నీటిపారుదల శాఖ  అధికారులు జాప్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎంతో మంది రైతులకు కడుపునింపే మూసీ ప్రాజెక్ట్ కాల్వల ప్రక్షాళనకు ప్రభుత్వం ఉత్తర్వులు వెంటనే జారీచేయగా, పనుల్లో మాత్రం జాప్యం జరుగుతుంది. గత ఏడాది అక్టోబర్ 12న సూర్యాపేటలో పలు అభివృధ్ది పనులకు శంకుస్థాపన చేయడానికి పర్యటనకు విచ్చేసిన సిఎం కెసిఆర్ మూసీ ప్రాజెక్ట్ ప్రస్థావనలో భాగంగా ఆధునికీరణకు రూ. 65కోట్లు కేటాయించిన విషయం విధితమే. సిఎం ప్రకటించిన కొద్ది రోజుల్లోనే నిధులు విడుదలయ్యాయి . పనులు వేగంగా సాగాల్సిన తరుణంలో టెండర్‌ల ప్రకియల్లో నీటిపారుదల శాఖ అధికారులు జాప్యం చేస్తున్నట్లు తెలుస్తుంది . ఈనేపథ్యంలో ప్రాజెక్టలో నీటి నిల్వ ఉండటంతో యాసంగి సాగుకు నీటిని విడుదల చేసినట్లు శాఖాధికారులు చెప్తున్నారు. విడతల వారిగా మార్చి వరకు నీటి విడుదల షెడ్యూలును ప్రకటించారు. ఈ నేపధ్యంలో అప్పటి వరకు పనులు ప్రారంభమయ్యే అవకాశమే లేదు. దీనితో యాసంగిలోనూ అత్తెసరు నీటితోనే సాగుకు సిద్దమవ్వాల్సిన పరిస్థితి ఆయకట్టు రైతులది. కాల్వల లైనింగ్‌లు దెబ్బతిని ,షట్టర్లు లేక ఆయకట్టు చివరి భూములకు నీరు చేరడం కష్టతరమే అనిపిస్తుంది. టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి కాల్వల రూపురేఖల మార్చే పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉంది.
ప్రాజెక్టు ఆధునీకీకరణ ప్రతిపాదనలు
మూసీ ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువలకు యాసంగి పంటకు నీరందించేందుకు నీటి విడుదల జరిగింది. మూసీ ప్రాజెక్ట్ ఎడమ కాల్వ ద్వారా పెన్‌పహాడ్, సూర్యాపేట, చివ్వెంల మండలాలకు అందిస్తున్నారు. 42 కిలోమీటర్ల పొడవుకు నీరు అందిస్తున్నారు. దీని కింద 15 వేల 230 ఎకరాలకు నీరు అందుతుంది. కుడి కాలువ కేతేపల్లి, తిప్పర్తి, వేములపల్లి, మాడ్గులపల్లి మండలాలకు నీరు అందగా 14 వేల 770 ఎకరాలకు నీరు సమకూరుతుంది. దీని ద్వారా ఆధునీకీకరణను వెంటనే చేయాల్సి ఉండగా ఆలస్యం కావడంతో నీరు కాస్త వృథా అయ్యే అవకాశం కనిపిస్తుంది. 1990లో నేషనల్ వాటర్ మిషన్ నుంచి రూ.కోటి మాత్రమే మంజురయ్యాయి. ఆ నిధులతో అక్క డక్కడా లైనింగ్ వేసి పిచ్చి మొక్కలను తొలగించారు. కాల్వులు శిథిలావస్థకు చేరాయి. కాల్వల్లో ఎక్కడా చూసినా పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయి. పలు చోట్ల తూములు దెబ్బతిన్నాయి. మూసీ ఎడమ కాల్వ కింద వేములపల్లి మండలంలోని పలు గ్రామాలకు సాగు నీరు చేరాల్సి ఉండగా నేటి వరకు కూడా చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. తూములకు షట్టర్లు లేకపోవడంతో అధికశాతం నీరువృథా అవుతోంది.
గతంలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పనులు అంతంత మాత్రమే
గత ప్రభుత్వాలు విడుదల చేసిన కొద్దిపాటి నిధులతో కాలువల మరమ్మత్తులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. విడుదలైన కాస్త నిధులు దుర్వినియోగం కావడంతో పనులు నాసిరకంగా జరిగినట్లు, గతంలో పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.18.50 కోట్లు నిధులతో ప్రాజెక్టులో 20కొత్త గేట్లను నిర్మించడంతో ప్రాజెక్టు నుంచి నీటి వృధా తగ్గింది. 4 కిలోమీటర్ల బీటీ రోడ్లును ప్రాజెక్టు పై నిర్మించారు. రెండున్నర కిలోమీటర్ల పొడవు గా రక్షణ గోడను నిర్మించారు. ఆధునీకరణకు మరిన్నీ నిధులు కేటాయిస్తే కనీసం ఒక పంటకైనా రైతులకు సాగు నీరు లభిస్తుంది. సూర్యాపేట,నకిరేకల్ ,మిర్యాలగూడెం నియోజక వర్గాలలోని పలు గ్రామా ల రైతులు మూసీ ఆధునీకరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా రు. కాల్వలను శుభ్రం చేయడం తూములకు షట్టర్లు బిగించ డం. బెడ్‌లైనింగ్ ,స్ట్రక్చర్ల నిర్మాణం, అండర్ టన్నెల్ నిర్మా ణం చేస్తే 30 వేల ఎకరాల ఆరుతడి పంటలు సాగులోకి వచ్చే అవకాశముంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల తో కాల్వల లైనింగ్‌కు రూ.22.79కోట్లు ,ఇరువైపులా రాతి కట్టుబడికి రూ.23.88కోట్లు ,కాల్వ కట్టల మరమ్మతులకు ,వెడల్పు కోసం రూ.8.77కోట్లు ,12బ్రిడ్జిలు నిర్మాణానికి రూ.1.89కోట్లు,పాడైపోయిన తూముల మరమ్మతులకు రూ.2,92కోట్లు ,22 షట్టర్లకు రూ,34లక్షలు , డ్యాంపైన ర క్షణ గోడ నిర్మాణానికి రూ.1.58కోట్లు ఖర్చు చేయనున్నారు.
రబీకి విడతల వారీగా నీటి విడుదల
గత నెల 18న విడుదలైన మూసీ ప్రాజెక్టు నీటి విడుదల మొదట 25 రోజులు అందించి పది రోజుల పాటు ఆప్‌లో ఉంచుతారు. మరల 15 రోజులు అందించి పది రోజుల పాటు ఆప్‌లో ఉంచుతారు. మరోసారి 15 రోజులు అందించి పది రోజుల పాటు ఆప్‌లో ఉంచుతారు. చివరిగా పంట చేతికొచ్చే వరకు నీరందించేందుకు శాఖాధికారులు అప్రమత్తంగా ఉంటారని ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. సిబ్బంది కొరత కూడా ఉండడంతో పనుల్లో అక్కడక్కడ జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తుంది. 52మంది గ్యాంగ్‌మేన్లకు 14మంది మాత్రమే ఉన్నారు. 19మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లకు నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఫిట్టర్లు ముగ్గురు ఉండాల్సిందిగా ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. ఎలక్ట్రీషియన్‌కు ఇద్దరికి ఒక్కరే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News