Home తాజా వార్తలు `కేజీఎఫ్-2` టీజర్: హీరో, డైరెక్టర్‌కు నోటీసులు!

`కేజీఎఫ్-2` టీజర్: హీరో, డైరెక్టర్‌కు నోటీసులు!

Yash sent legal notice over KGF 2 smoking scene

 

`కేజీఎఫ్-2` టీజర్ ఇంటర్నెట్‌లో దూసుకుపోతోంది. విడుదలైన గంటల్లోనే కోట్ల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించింది. యశ్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్ 2 టీజర్ త‌న  పుట్టిన రోజు సందర్భంగా జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ రికార్డులు బ్రేక్ చేసింది. విడుదలైన 48 గంటల్లోపే ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది.  ఇక,  లైక్స్ విషయంలో అయితే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్, 2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి టీజర్‌ బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ఈ టీజర్‌కు సంబంధించి హీరో యశ్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్, నిర్మాత నోటీసులు తెలుస్తోంది. కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ తాఖీదులు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దానికి కారణం టీజర్ చివర్లో చూపించిన ఓ సన్నివేశం. ఇందులో హీరో యశ్ గన్‌తో వరుసగా వాహనాలను షూట్ చేసి గన్ నుంచి వచ్చే బుల్లేట్ల వేడికి తుపాకీ గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు. దీనిపై యాంటీ టొబాకో సెల్‌ అభ్యంతరం తెలిపింది. ‘యాంటీ స్మోకింగ్‌ వార్నింగ్‌’ ఎందుకు వేయలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం.. ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరిక ఇవ్వాల్సి ఉండగా.. టీజర్‌లో వేయలేదు. దీంతో ఎందుకు ఇవ్వలేదని నోటిస్ పంపినట్లు తెలుస్తోంది.

Yash sent legal notice over KGF 2 smoking scene