Saturday, April 20, 2024

’యశోద’ ట్రైలర్ డేట్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

'Yashoda' Movie Trailer release on Oct 27

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ’యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి, హరీష్ కలిసి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్‌ 27న సాయంత్రం 5.36 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో రావు రమేశ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

‘Yashoda’ Movie Trailer release on Oct 27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News