Home జాతీయ వార్తలు వెన్నునొప్పితో యశ్వంత్ సిన్హా ఆసుపత్రిలో చేరిక

వెన్నునొప్పితో యశ్వంత్ సిన్హా ఆసుపత్రిలో చేరిక

Yashwant Sinha admitted to hospital with back pain

 

కోల్‌కత: తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్న మాజీ కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు యశ్వంత్ సిన్హా ఇక్కడి ప్రభుత్వ నిర్వహణలోని ఎస్‌ఎస్‌కెంఎ ఆసుపత్రిలో చేరారు. 84 ఏళ్ల యశ్వంత్ సిన్హాను మంగళవారం ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్వల్పంగా మెరుగుపడినట్లు ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి డాక్టర్ ఒకరు తెలిపారు.

Yashwant Sinha admitted to hospital with severe back pain