Home Default వైసిపి నేత దారుణ హత్య

వైసిపి నేత దారుణ హత్య

YCP Leader Murder in Anantapur

అనంతపురం : వైసిపి నేత కేశవరెడ్డిని దుండగులు బుధవారం హత్య చేశారు. ఆత్మకూర్ గ్రామ సర్పంచ్‌గా ఆయన పని చేశారు. దుండగులు పథక ప్రకారం ఆయనపై కత్తులు, రాడ్‌లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని ఆస్పత్రిని తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. పాతకక్షల కారణంగానే కేశవరెడ్డిని హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టిడిపి వారే కేశవరెడ్డిని హత్య చేశారని ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని వారు పేర్కొన్నారు.

YCP Leader Murder in Anantapur