అమరావతి: టిటిడి ప్రతిష్టతను దిగజార్చేలా వైసిపి వ్యవహరిస్తోందని టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanuprakash Reddy) మండిపడ్డారు. టిటిడిపై జరుగుతున్న కుట్ర కోణంపై డిజిపి, ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..టిటిడిపై కుట్ర చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించారు. టిటిడి గోశాలలో ( TTD cowshed) గోవుల మృతిపై అసత్య ప్రచారం చేశారని భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు. తిరుమలపై ఒక వ్యక్తి చేత వైసిపి నేతలే నమాజ్ చేయించారని, నమాజ్ చేయించి సోషల్ మీడియాలో వీడియో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లలో సదుపాయాలు లేవని వైసిపి నేత ఆందోళన చేశారని అన్నారు. వైసిపి నేతలు ఇలాగే వ్యవహరిస్తే కఠినంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఓటమి తర్వాత వైసిపి నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారారని, రాజకీయంగా ఎదుర్కోలేక టిటిడి పై అసత్య ప్రచారం చేస్తున్నారని భాను ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.
వైసిపి నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారారు: భాను ప్రకాశ్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -