Home Default టిడిపి గుర్తింపును రద్దు చేయాలి : విజయసాయిరెడ్డి

టిడిపి గుర్తింపును రద్దు చేయాలి : విజయసాయిరెడ్డి

YCP MP Vijayasai Reddy Meets Ram Nath Kovindన్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతున్న ప్రతిపక్ష టిడిపి గుర్తింపును రద్దు చేయాలని వైసిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు. మంగళవారం విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి ఎంపిల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. టిడిపి గుర్తింపును రద్దు చేయాలని  విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎపి పరువును తీస్తున్న టిడిపి జాతీయ అధ్యక్షుడిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. రాష్ట్ర సిఎం జగన్ ను అసభ్య పదజాలతో చంద్రబాబు దూషిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎపిలో టిడిపి దుకాణం పూర్తిగా మూతపడుతుందని, ఈ విషయాన్ని తట్టుకోలేకనే చంద్రబాబు వైసిపిపై , సిఎం జగన్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టిడిపి అంటేనే బూతుల పార్టీగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితుల్లో టిడిపి లేదని ఆయన తెలిపారు. వచ్చే 20 ఏళ్లు ఎపిలో వైసిపినే అధికారంలో ఉండడం ఖాయమని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.