Home చిన్న సినిమాలు జాయ్‌ఫుల్ మెలోడీ

జాయ్‌ఫుల్ మెలోడీ

Ye Zindagi Lyrical song released

 

అక్కినేని అఖిల్, – పూజాహెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ’బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్2 బ్యానర్‌పై బన్నీ వాస్, – వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని ‘మనసా మనసా’, ‘గుచ్చే గులాబీ’ పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘ఏ జిందగీ…’ అనే మరో గీతాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘ఆకాశమంతా ఆనందమై.. తెల్లారుతోందే నా కోసమై.. ఆలోచనంతా ఆరాటమై.. అన్వేషిస్తోందో ఈ రోజుకై’ అంటూ సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు గోపీ సుందర్ మంచి ట్యూన్ కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట ద్వారా హానియా నఫీసా గాయనిగా టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. గోపి సుందర్ ఆమెతో పాటు గొంతు కలిపారు. ఇందులో అఖిల్, – పూజాహెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఈ జాయ్‌ఫుల్ మెలోడీ వినసొంపుగా ఉండి శ్రోతలను అలరిస్తోంది.