Home జాతీయ వార్తలు జెడి(ఎస్)కు మంత్రివర్గంలో చోటిచ్చే ఆలోచన లేదు

జెడి(ఎస్)కు మంత్రివర్గంలో చోటిచ్చే ఆలోచన లేదు

Yediyurappa brushes aside JD(S) speculation joining

 

న్యూఢిల్లీ: జెడి(ఎస్)కు మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పిస్తారన్న ఊహాగాలను కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కొట్టిపారేశారు. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన యడియూరప్ప తన ప్రభుత్వానికి జెడి(ఎస్) మద్దతు అవసరం లేదని, తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నదని స్పష్టం చేశారు. ఇటీవల జెడి(ఎస్) నేత,మాజీ సిఎం హెచ్‌డి కుమారస్వామి తనతో భేటీ అయిన సందర్భంగా అభివృద్ధి పనుల గురించి చర్చించామని, రాజకీయాలపై కాదని యడియూరప్ప తెలిపారు.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తన కుమారుడు విజయేంద్ర సూపర్ సిఎంగా వ్యవహరిస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిరస్కరించారు. పార్టీ అభివృద్ధిపై తన కుమారుడు దృష్టి పెట్టారని, అసూయతో కొందరు ఆధారరహిత ఆరోపణలు చేస్తున్నారని యడియూరప్ప అన్నారు. మంత్రివర్గ విస్తరణపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రధాని మోడీసహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి తమ రాష్ట్రానికి అందాల్సిన కేంద్ర సహాయం గురించి యడియూరప్ప చర్చిస్తున్నారు.

Yediyurappa brushes aside JD(S) speculation joining