Home జాతీయ వార్తలు మోడీ, ఇజ్రాయెల్‌ ప్రధాని స్నేహాబంధం

మోడీ, ఇజ్రాయెల్‌ ప్రధాని స్నేహాబంధం

 

న్యూఢిల్లీ: ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ట్విటర్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత్‌కు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మన మైత్రి ఎప్పుడూ బల పడుతూ ఉండాలి. మన భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరుకుంటోంది’ అని ట్వీట్‌ చేశారు. భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ.. మోడీ, నెతన్యాహూ కలిసి ఉన్న ఫొటోలను వీడియోగా మార్చి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  ‘షోలే’ సినిమాలోని ‘యే దోస్తీ హమ్‌ నహీఁ ఛోడేంగే…’ అనే పాటను బ్యాగ్రౌండ్లో ప్లే చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

దీనిపై ప్రధాని మోడీ కూడా ట్వీట్టర్ ద్వారా ఇజ్రాయెలీ భాషలో బదులిచ్చి అంతే ఆశ్చర్యానికి గురిచేశారు. ‘ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు, ఇజ్రాయెల్ ప్రజలకు ధన్యవాదాలు. సుదీర్ఘకాలంగా భారత్, ఇజ్రాయెల్ తమ మైత్రిని చాటుకుంటున్నాయి. మన బంధం విడదీయరానిది, సుదృఢమైనది. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య చెలిమి మరింతగా ఎదగాలని, వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ మోడీ ఇజ్రాయెలీ భాషలో ట్వీట్ చేశారు.

‘Yeh Dosti Hum Nahi Todenge…’: Israel PM