Sunday, July 21, 2024

నేటి నుంచి మామూలుగా యెస్ బ్యాంక్ సేవలు

- Advertisement -
- Advertisement -

Yes Bank

 

ఎటిఎంలలో నగదు కొరత ఉండదు
యెస్ బ్యాంక్ నిర్వాహకుడు ప్రశాంత్ కుమార్

న్యూఢిల్లీ: బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి యెస్ బ్యాంక్ సేవలను సాధారణంగా ఉంటాయని, ద్రవ్యకొరత సమస్యలు ఉండబోవని బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఏప్రిల్ 3 వరకు యెస్ బ్యాంక్‌పై మారటోరియం విధించిన విషయం తెలిసిందే. అయితే మారటోరియం గడువుకు ముందే బ్యాంక్ కస్టమర్లకు అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

సోమవారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, యెస్ బ్యాంక్‌లో డిపాజిట్లు భద్రంగా ఉన్నాయని, డిపాజిటర్లు విత్‌డ్రా కోసం తొందరపడాల్సిన అవసరం లేదని అన్నారు. దాస్ ప్రకటనను కుమార్ స్వాగతిస్తూ, ఇది చాలా చాలా సానుకూల విషయమని అన్నారు. ప్రభుత్వం మార్చి 5న యెస్ బ్యాంక్‌పై మారటోరియం విధించి, బోర్డును 30 రోజులపాటు రద్దు చేసింది. అలాగే డిపాజిటర్లను కాపాడేందుకు విత్‌డ్రాలపై ఆంక్షలు విధించింది.

సుభాష్, నరేష్ గోయల్‌కు ఇడి సమన్లు
యస్ బ్యాంక్ రుణగ్రస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) దృష్టిపెట్టింది. యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా మరింత కొంతమందికి ఇడి సమన్లు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, కాక్స్ అండ్ కింగ్స్ ప్రమోటర్ పీటర్ కేర్కర్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రమోటర్ కపిల్ వాధ్వాన్‌లకు ఇడి సమన్లు పంపింది. వీరితో పాటు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి గురువారం హాజరు కావాల్సిందిగా తాజాగా నోటీసులు జారీ చేయనున్నారు.

 

Yes Bank services as usual from today
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News