Home జాతీయ వార్తలు తప్పులు మీరు చేసి వోటర్లను నిందిస్తారా?

తప్పులు మీరు చేసి వోటర్లను నిందిస్తారా?

న్యూఢిల్లీ: యువత వాయిదాల పద్ధతిలో సొంత కారు కొనకుండా ఓలా, ఊబర్ వంటి ట్యాక్సీ సర్వీసులను ఉపయోగించకం కూడా దేశంలో ఆటో పరిశ్రమ కుంటుపడడానికి కారణమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. కేంద్రం తన తప్పును ఇతరులపైకి మోపుతోందే తప్ప దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తన విధానాలే కారణమని మాత్రం చెప్పడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. వోటర్లను నిందిస్తున్నారే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలో తెలుసుకోలేకపోతున్నారని ఆయన నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

మోడీ టిట్టర్ ఫాలోవర్లు 5 కోట్ల మంది దాటారని, దేశ ఆర్థిక నిల్వలు 5 లక్షల కోట్లకు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే అది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. యువజనులకు ఉద్యోగాలు దొరకడం లేదని, దీనికి కూడా ప్రతిపక్షమే కారణమని నిందిస్తారా అంటూ ఆయన నిలదీశారు. మంచి జరిగితే అది తమ ఘనతని, చెడు జరిగితే అది ఇతరులు చేసిందని ప్రభుత్వం చెప్పుకుంటోందని, మరి ప్రజలు మిమల్ని ఎందుకు ఎన్నుకున్నారని సింఘ్వీ ప్రశ్నించారు.

‘Yes, Blame the Voters, Mrs Finance Minister’: Cong Takes Swipe at Sitharaman’s Remark on Millennials
The Congress, in a tweet, also attacked the government over a media report claiming that crores of stocks in investor wealth has been wiped off in the first 100 days of the Modi governments second term.