Wednesday, April 24, 2024

ఈ ఛాయ్ తాగారో.. అంతే సంగతులు!

- Advertisement -
- Advertisement -

Amruttulya Tea

ముంబయి: మహారాష్ట్రలో విశేష జనాదరణ పొందిన ఏవలే అమృతుల్య అనే టీ బ్రాండ్ కల్తీకి పాల్పడుతున్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ తేల్చింది. టీలో ఎరుపు రంగు వచ్చేందుకు హానికరమైన రసాయనాలు వాడుతున్నట్లు ఎఫ్‌డిఎ వెల్లడించింది. మొదట పుణెలో ప్రారంభమైన ఈ టీ బ్రాండ్ ఆ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఎప్పుడూ తేనీరు ప్రియులతో కిటకిటలాడే ఈ బ్రాండ్ ఔట్‌లెట్లు ప్రస్తుతం పుణెతోపాటు ముంబయి, నాసిక్ తదితర ప్రాంతాలలో కూడా ఏర్పడ్డాయి. తేనీరు ఎర్రగా కనిపించేందుకు అదనపు రంగులు వాడుతున్నట్లు తమ పరీక్షలలో వెల్లడైందని ఎఫ్‌డిఎ నివేదిక వెల్లడించింది.

టీలో కొన్ని రసాయనాలతోపాటు హానికరమైనమైన పదార్థాలను కూడా కలుపుతున్నారని నిర్ధారించిన ఎఫ్‌డిఎ అన్ని ఔట్‌లెట్లను మూసివేయాలని ఈ సంస్థను ఆదేశించింది. అంతేగాక, ఏవలే అమృతుల్య తన బ్రాండ్ ప్రచారం ద్వారా వినియోగదారులను మోసం చేస్తోందని భారత ప్రచార మండలి తేల్చింది. టీ తయారీలో మినరల్ వాటర్‌ను ఉపయోగిస్తున్నామన్న ఏవలే అమృతుల్య ప్రచారంలో నిజం లేదని ఎఫ్‌డిఎ పరీక్షలలో తేలింది.

Yewale Amruttulya Tea is Adulterated, FDA Reveals Reason Behind Colour Of Dark Red Tea

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News