Wednesday, May 29, 2024

సిఎఎకు, ఎన్‌ఆర్‌సికి సంబంధం లేదు

- Advertisement -
- Advertisement -

Yogi Adityanath

 తప్పుదారి పట్టించడం బాధాకరం
స్పష్టం చేసిన యోగి ఆదిత్యనాథ్

గయ (బీహార్): దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం పౌరసత్వ సవరణ చట్టంపై (సిఎఎ) చేస్తున్న ప్రయత్నాలు బాధాకరంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆరోపించారు. వివాదాస్పదమైన ఈ చట్టానికి మద్దతుగా ఇక్కడ ఏర్పాటుచేసిన ఒక ర్యాలీలో ఆయన ప్రసంగించారు. సిఎఎ ఉన్నది పౌరసత్వం ఇచ్చేందుకే కానీ, దాన్ని లాక్కోవడానికి కాదని, సిఎఎకు, జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)కి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.సుప్రీంకోర్టు ఆదేశం మేరకే అసోంలో ఎన్‌ఆర్‌సి ప్రక్రియను చేపట్టినట్టు ఆదిత్యనాథ్ తెలిపారు.

ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, సిఎఎ వంటి అంశాల్లో నిర్ణయాత్మకంగా, కచ్చితంగా వ్యవహరిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని యుపి సిఎం ప్రశంసించారు. రాజ్యాంగమంటే ఏమాత్రం గౌరవం లేకుండా ఫత్వాల పాలన కావాలనే వారు దీంతో దుకాణం మూసుకోవాల్సి వచ్చింది. బాలాకోట్ దాడులు నూతన భారతానికి నాంది పలికాయి. కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించింది. అయితే అణుశక్తి ఉన్నా పాకిస్థాన్ ఎదిరించలేకపోయింది. ఆర్టికల్ 370 రద్దు ఈ దిశగా వేసిన మరో ముందడుగు. ఈరోజు పాకిస్థాన్ తన ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌ను కూడా పోగొట్టుకుంటానేమో అన్న భయంతో బతుకుతోంది’ అని యోగి చెప్పినప్పుడు జనం హర్షధ్వానాలు చేశారు.

Yogi Adityanath Rally At Bihar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News