ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : జియో రాకతో టెలికాం రంగంలో పోటీ బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి టెలికాం కంపెనీలు భారీగా అఫర్లు ప్రకటించడం పరిపాటిగా మారింది. అదే క్రమంలో ఎయిర్ టెల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకొనేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా 4 జి తీసుకోవడం లేదా 4జి డివైజ్‌కు మారే వినియోగదారులకు 11 జిబి డేటా వరకు డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఈ డేటా రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది. ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. కొత్త వినియోగదారుడైతే ఎయిర్టెల్ ఫ్రీడేటాను రెండు విడతల్లో పొందే అవకాశం ఉంది. అందులో మొదటిది కొత్తగా ఎయిర్టెల్ 4జి కస్టమర్ ‘ఎయిర్టెల్ థ్యాంక్స్’యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే 5 జిబి డేటా వస్తుంది.
అయితే ఈ డేటా మొత్తం ఐదు 1జిబి కూపన్ల రూపంలో మూడు రోజుల వ్యవధిలో యాప్‌లో క్రెడిట్ వుతుంది. కొత్త మొబైల్ నంబర్ యాక్టివేట్ అయిన నెలరోజుల్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. ఐదు కూపన్లు వస్తే యాప్‌లోని మై కూపన్స్సెక్షన్కు వెళ్లి వాటిని క్లెయిమ్ చేసుకోవాలి. అలాగే 1జిబి డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్ అయిన 90 రోజులోల రీడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘ ఎయిర్టెల్ థ్యాంక్స్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకపోతే 5 జిబి డేటాకు బదులు 2 జిబి డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే ఎయిర్టెల్ కూడా తన అన్లిమిటెడ్ ప్యాకేజి తీసుకునే కస్టమర్లకు దాదాపుగా 6 జిబి డేటాను ఉచితంగా ఇవ్వనుంది. 84 రోజుల వ్యాలిడిటీతో రూ.598 అంతకన్నా ఎక్కువ మొత్త ప్యాకేజిలను ఎంచుకునే వారికి 6జిబి డేటా ఉచితంగా వస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది. అయితే ఈ డేటా కూడా ఒక్కసారిగా రాదు. వినియోగదారులకు ఆరు 1జిబి ఉచిత డేటా కూపన్ల రూపంలో వస్తుంది.