Thursday, April 25, 2024

యువ నటుడు సుధీర్ వర్మ మృతి

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న సుధీర్‌ వర్మ వైజాగ్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషం తాగి చనిపోయినట్లు ఎల్జీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఉదయం 4.18 నిమిషాలకు చనిపోయినట్టు మరణ నివేదిక అందించారు.

సెకండ్‌ హ్యాండ్‌, కుందనపు బొమ్మ చిత్రాల్లో నటించాడు సుధీర్‌ వర్మ. కుందనపు బొమ్మ సినిమాలో సుధాకర్‌ కోమాకులతో కలిసి వన్ ఆఫ్‌ ది లీడ్ యాక్టర్‌గా నటించాడు. సుధీర్ వర్మ ఆకస్మిక మృతి పట్ల సుధాకర్‌ కోమాకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News