Home తాజా వార్తలు మైనర్ బాలికపై బాలుడు అత్యాచారం..!

మైనర్ బాలికపై బాలుడు అత్యాచారం..!

Young Boy rape Minor Girl in Vishakhapatnam District

అమరావతి: మైనర్ బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఎపిలోని విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం తలాబుతోట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుజనకోట పంచాయతీ తలాబుతోట కాలనీకి చెందిన గిరిజన బాలిక(8) శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లింది. బాలికను వెంబడిస్తూ వెళ్లిన బాలుడు(17) ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటికి వచ్చి బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ముంచంగిపుట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.