Tuesday, September 17, 2024

యువ వైద్యురాలు డిప్రెషన్ తో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young doctor commit suicide with depression

ముంబయి: యువ వైద్యురాలు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముంబయిలోని ఓర్లీ ప్రాంతానికి చెందిన నిటాశా బెంగాల్లీ అనే యువ వైద్యురాలు గత కొన్ని రోజుల నుంచి డిప్రెషన్‌తో బాధపడుతోంది. ఎంబిబిఎస్ పూర్తి చేసి అనంతరం ఎండి చదువుతోంది. చదువుల విషయంలో ఆమె చాలా ఒత్తిడికి గురికావడంతో చికిత్స తీసుకున్నట్లుగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడిలో ఆమె ఇంజెక్షన్ తీసుకున్న అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఆమె స్నేహితులు యువ వైద్యురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News