ఖమ్మం: తనను ప్రేమించిన యువతి వేరొక యువకుడితో సన్నిహితంగా ఉండటాన్నిసహించలేని యువకుడు యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకపల్లిలో తేజస్విని,నితిన్ అనే యువకుడు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తేజస్విని తనను ప్రేమిస్తూ వేరే యువకుడితో చనువుగా ఉంటోందన్న కారణంగా నితిన్ యువతిని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తేజస్వినిని హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని లంకపల్లిగుట్టల్లో పడేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తేజస్విని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు నితిన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.