Thursday, April 25, 2024

‘టిక్ టాక్’ కోసం పిల్లికి ఉరివేసి..

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: టిక్ టాక్ మోజులో కొంతమంది యువకులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.  టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అవ్వాలనుకుని చాలా మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. తాజాగా ఓ యువకుడు టిక్ టాక్ లో లైకుల కోసం క్రూరంగా ప్రవర్తించాడు. తమిళనాడులో తంగరాజు అనే యువకుడు లైక్ ల కోసం పిల్లి మెడకు తాడుతో ఉరేసి టిక్ టాక్ వీడియోను చిత్రీకరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తిరుసల్వేలి జిల్లా అయనూర్ లో సదరు యువకుడు తంగరాజును అరెస్టు చేశారు.

Young Man arrested torture to Cat for Tiktok in Tamil nadu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News