Home అంతర్జాతీయ వార్తలు ప్రాణాలు కోసం… ఎలుగుబంటి నాలుకను ఊడొచ్చేలా కొరికాడు

ప్రాణాలు కోసం… ఎలుగుబంటి నాలుకను ఊడొచ్చేలా కొరికాడు

 

మాస్కో: రష్యాలోని సైబీరియా ప్రాంతం తువాలో ఓ యువకుడు ఎలుగుబంటి నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఎలుగుబంటి నాలుకను ఊడొచ్చేలా కొరికాడు. దీంతో ఎలుగుబంటి పారిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇర్గిట్ అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి జింక కొమ్ముల కోసం అడవికి వెళ్లారు. బ్లాక్ మార్కెట్‌లో జింక కొమ్ములకు మంచి రేటు ఉండడంతో ఆశ పడి అడవికి వెళ్లారు. కొన్ని జింక కొమ్ములు సేకరించిన అనంతరం టెంట్ ఏర్పాటు చేసుకొని ముగ్గురు యువకులు కునుకు తీశారు. ఇర్గిట్ ఇంకా ఆశ పెరగడంతో మరిన్ని జింక కొమ్ముల కోసం వెతకడం ప్రారంభించారు. వీళ్లు దారిలో వెళ్తుండగా పెద్ద ఎలుగుబంటి కనిపించింది. ఎలుగుబంటిని చూడగానే ఎర్గిట్ ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అయిపోయింది. ఎలుగుబంటి అతడిపై దాడి చేసింది. దీంతో మనోడు ఎలుగుబంటితో కొంచెం సేపు యుద్ధం చేశాడు. ఎలుగుబంటి అమాంతం నోరు తెరిచి ఇర్గిట్ తలను లాగింది. ఎలుగుబంటి నాలుకను గట్టిగా తన పళ్లతో కొరికడంతో దాని నాలుక బయటకు వచ్చేసింది. దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గట్టిగా అరవడంతో స్నేహితులు ఇర్గిట్ దగ్గరికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఇర్గిట్ పై కేసు నమోదు చేశారు. ఆస్పత్రి నుంచి ఇర్గిట్ డిశ్చార్జ్ కాగానే రిమాండ్ తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. ఎలుగుబంటితో పోట్లాడి తప్పించుకున్నాడు కానీ పోలీసులు తప్పించుకోలేకపోయాడని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అతడి ధైర్యానికి కొందరు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

 

Young Man Biting off Part of its Tongue in Russia