Home తాజా వార్తలు మోత్కూర్ లో యువకుడు ఆత్మహత్య

మోత్కూర్ లో యువకుడు ఆత్మహత్య

Young man commit suicide in Mothkur

 

మన తెలంగాణ/మోత్కూరు: యాదాద్రి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అన్నెపువాడకు చెందిన అన్నెపు నరేందర్, నిర్మల దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నవీన్‌కు రెండేళ్ల క్రితం వివాహం కాగా వేరు కాపురం ఉంటున్నారు. గురువారం భార్య, తల్లిదండ్రులు పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో అన్నెపు నవీన్ (25) చీరతో ఉరి వేసుకుని మృతి చెందాడు. పనుల నుంచి సాయంత్రం భార్య, తల్లిదండ్రులు ఇంటికి రాగా తలుపులకు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎంతకు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారి సాయంతో పగలకొట్టి చూడగా నవీన్ వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు, భార్య లబోదిబోమని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా నవీన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.