Home జనగామ సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నాడని మందలించడంతో….

సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నాడని మందలించడంతో….

జనగాం: ఎప్పుడు చూసిన సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నాడని కుమారుడిని తండ్రి మందలించడంలో అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉప్పుగల్లు గ్రామానికి చెందిన కొప్పుల రాజు-అనిత దంపతులకు శ్రీచరణ్ గౌడ్ కుమారుడు ఉన్నాడు. శ్రీచరణ్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాలిటెక్సిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్నాడు. స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండడంతో పలుమార్లు కుమారుడిని తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

చరణ్ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబ సభ్యులు నిద్రపోయేవరకు వేచి చూశాడు. అనంతరం బైక్ తీసుకొని స్టేషన్‌ఘన్‌పూర్ వెళ్లాడు. 12.54 గంటలకు ఐయామ్ వెరీ సారీ డాడీ అంటూ అమ్మ, చెల్లెని బాగా చూసుకోవాలని వాట్సాప్ సందేశం పంపాడు. మళ్లీ 1.10 ప్రాంతంలో ఐయామ్ వెరీ వెరీ సారీ డాడీ… తన సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని, డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్ యు అంటూ మళ్లీ సందేశం పంపాడు. 1.15 రైల్వే స్టేషన్ లోకేషన్ కూడా షేర్ చేశాడు. గాఢ నిద్రలో ఉండడంతో వారు వ్యాట్సాప్ మేసేజ్‌లను చూసుకోలేదు. రాత్రి 1.20 దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్‌ఫోన్‌లో సందేశాలు చూసిన రాజు వెంటనే ఘన్‌పూర్‌కు వెళ్లాడు. రైల్వే పట్టాలపై కుమారుడి తల, మొండెం వేరు వేరుగా పడి ఉన్నాయి. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.