Home తాజా వార్తలు కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

Young Man Commitis Suicide In Sangareddyసంగారెడ్డి : కుటుంబ కలహాల కారణంగా  మహేశ్ (27) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన  కంది మండల పరిధిలోని కాశీపూర్‌ గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి  చెందిన మహేశ్ కు శంకర్‌పల్లి మండల పరిధిలోని టంగుటూరు గ్రామానికి చెందిన శిరీషతో పది నెలల క్రితం పెళ్లి జరిగింది. మహేశ్ తన భార్య శిరీషను ఈనెల 26న   పుట్టింటిలో వదిలి తిరిగి తన గ్రామానికి వచ్చాడు. గురువారం తన తల్లితో మహేశ్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గరైన మహేశ్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేశ్ భార్య శిరీష్ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి కావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం కోసం మహేశ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శిరీష ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.