Saturday, April 20, 2024

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young man commits suicide after failing to love

హైదరాబాద్: ప్రేమ విఫలం కావడంతో తట్టుకోలేక ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సన్నీ కుమార్(22)యువకుడు స్థానికంగా ఉంటున్న ఓ యువతిని ప్రేమించాడు. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ సతీష్‌చంద్రా తెలిపారు.

Young man commits suicide after failing to love

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News