Home జగిత్యాల ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

Suicide

కోరుట్ల: మండలంలోని మోహన్‌రావుపేట గ్రామానికి చెందిన శ్రీగద్దె శ్రావణ్(19) అనే యువకుడు స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం పరిసరాలలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహన్‌రావుపేట గ్రామానికి చెందిన శ్రీగద్దె బాపయ్య కళ్యాణిలకు ఇద్దరు కుమారులు, చిన్న వాడైన శ్రావణ్ ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో పాటూ,జల్సాలకు అలవాటు పడి జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. అదే క్రమంలో గురువారం రాత్రి 10గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన శ్రావణ్‌ను తండ్రి మందలించాడు. దాంతో కోపోద్రిక్తుడైన శ్రావణ్ ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా చేసి, బయటకు వెళ్లి పోయాడు.అనంతరం మానసికంగా ఆందోళన చెంది ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఎస్‌ఐ రాజునాయక్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి బాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Young Man Commits Suicide At Korutla Mandal