Home జాతీయ వార్తలు కరోనా కేర్ సెంటర్ లో రోగి ఆత్మహత్య

కరోనా కేర్ సెంటర్ లో రోగి ఆత్మహత్య

Young Man Commits Suicide In Corona Care Centreభోపాల్ : కరోనా రావడంతో కరోనా కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న ఓ యువకుడు(35) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఛతార్ పూర్ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ జూలై 26న పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిని కరోనా కేర్ సెంటర్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆరు మాసాల క్రితం సదరు వ్యక్తి ఛాతి సమస్య, గొంతు నొప్పితో చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలో కరోనా సోకడంతో సదరు వ్యక్తి భయాందోళనలకు గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం సదరు వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.