Home తాజా వార్తలు తానేదారుపల్లిలో యువకుడి ఆత్మహత్య

తానేదారుపల్లిలో యువకుడి ఆత్మహత్య

Young Man Commits Suicide In Thanedarupallyనల్లగొండ : భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు  విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండల పరిధిలోని తానేదారుపల్లిలో  గురువారం జరిగింది. తానేదారుపల్లి గ్రామానికి చెందిన  చంద్రశేఖర్ రెడ్డికి గత ఏడాది నాగార్జునసాగర్‌కు చెందిన శాంతి అనే యువతితో పెళ్లి జరిగింది. అయితే చంద్రశేఖర్, శాంతిల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో కొంతకాలంగా శాంతి పుట్టింట్లోనే ఉంటుంది. దీంతో మనస్థాపానికి గురైన చంద్రశేఖర్ రెడ్డి గ్రామ శివారులోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం చంద్రశేఖర్ రెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.