Home తాజా వార్తలు రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

young man commits suicide on railway track in hyderabad
మిర్యాలగూడ క్రైమ్‌ః హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ సమీపంలో ఆదివారం ఉదయం మిర్యాలగూడలోని రవీందర్‌నగర్‌కు చెందిన గట్టుపల్లి యాదగిరిరెడ్డి (30) అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. తెలిసిన వివరాల ప్రకారం పట్టాణానికి చెందిన గట్టుపల్లి యాదగిరిరెడ్డి హైద్రాబాద్‌లోని కెఎన్‌ఆర్ కన్‌స్ట్రక్స్‌న్‌లో ఫైనాన్స్ విభాగంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న మిర్యాలగూడకు వచ్చిన యాదగిరిరెడ్డి ఖమ్మంకు చెందిన అమ్మాయితో 15న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. మార్చి 2న వివాహాన్ని నిశ్చయించుకున్నారు. తిరిగి 16 సాయంత్రం హైద్రాబాద్‌కు చేరుకున్నాడు. కాని వివాహం కుదిరిన ఒక రోజు వ్యవధిలోనే యాదగిరిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందడం తల్లిదండ్రులను శోక సముద్రంలో ముంచింది.

young man commits suicide on railway track in hyderabad